భళా.. సప్తకళ!
ఖమ్మంగాంధీచౌక్: నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సప్తకళల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నాగబత్తిని రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ.. విభిన్నమైన, సాహసోపేతమైన కళలను ప్రదర్శించటం అభినందనీయమన్నారు. సాధారణ కళా ప్రదర్శనలకు భిన్నంగా కళలను విన్యాసాలకు జోడించి ప్రదర్శించటం ప్రత్యేక ప్రతిభగా అభివర్ణించారు.
భిన్నమైన ప్రదర్శనలు..
ముంబైకి చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ కిషన్ జంగ్లర్ కత్తుల జగ్లింగ్ ప్రదర్శన, చైన్నెకి చెందిన పాల్‌రాజ్ 5 ఫేస్ డ్యాన్స్, మణిక్ చంద్ వేసిన ప్లేట్లు, గ్లాసులపై రాజస్థానీ డ్యాన్స్, ఖమ్మానికి చెందిన బేబి ఫైర్ ప్రార్థవిక స్కేటింగ్‌పై భరతనాట్యం, మంటలతో ఫైర్ రవి, బేబీ పండు విన్యాసాలు, చైన్నెకి చెందిన కళాకారుల అమేజింగ్ డ్యాన్స్, శివనాగులు, కాల్వకట్ట జాన్ ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మిత్ర గ్రూప్స్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, తస్మా రాష్ట్ర కార్యదర్శులు ఐ.వి. రమణారావు, నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, కాళ్ల పాపారావు, జల్లా లక్ష్మీనారాయణ, బొల్లు సైదులు, టి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విన్యాసాలు
భళా.. సప్తకళ!
Comments
Please login to add a commentAdd a comment