కాలుష్య సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా
సత్తుపల్లి: సత్తుపల్లి సైలో బంకర్ నుంచి వస్తున్న కాలుష్య సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్‌నగర్ కాలనీ వాసులు సింగరేణి సైలో బంకర్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం మంత్రి తుమ్మలను గండుగులపల్లిలో కలిసిన బాధితులు సమస్యను ఆయనకు వివరించారు. సైలో బంకర్ నుంచి విడుదల చేస్తున్న బొగ్గు కాలుష్యంతో కాలనీలోని ప్రజలు ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులతో బాధ పడుతున్నారని, ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని విన్నవించారు. కాలుష్యం బారి నుంచి తప్పించి పునరావాసం కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం సింగరేణి అధికారులతో చర్చిస్తామని, అధికారుల స్పందనను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కడారి మదీనా, మారోజు నాగేశ్వరరావు, పాలకుర్తి నాగేశ్వరరావు, పాలకుర్తి ప్రభుదాసు, పాలకుర్తి మణిబాబు, కొత్త సాంబయ్య, కిష్టపాటి కోటిరెడ్డి, వాడపల్లి కోటేశ్వరరావు, కొండ నాగరత్నం, వాడపల్లి నాగమణి, పాలకుర్తి రాణి, వాడపల్లి అరుణ పాల్గొన్నారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
Comments
Please login to add a commentAdd a comment