మెరుగైన వైద్య సేవలందించాలి
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● మధిరలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం
మధిర: రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిర పట్టణంలోని కేవీఆర్ జనరల్ ఎమర్జెన్సీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు ఆరోగ్య శ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందుగా భట్టి విక్రమార్కకు ఆస్పత్రి అధినేత డాక్టర్ కోట రాంబాబు, డాక్టర్ అరుణకుమారి ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల రమణగుప్త, లావణ్య దంపతుల కుమార్తె సాత్విక వివాహ వేడుకకు హాజరైన భట్టి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment