ఖమ్మంరూరల్: మండలంలోని తెల్దారుపల్లి గ్రామ కార్యదర్శి కొడాలి రాధారాణి సంతకాన్ని అదే గ్రామానికి చెందిన చెరుకుపల్లి ముత్తయ్య ఫోర్జరీ చేశారని సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాధారాణి 2021 నుంచి 2022 వరకు గ్రామ కార్యదర్శిగా పని చేసిన సమయంలో ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ముత్తయ్య తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని చెరుకుపల్లి భవానీకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ మేరకు కార్యదర్శి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ ఎం.రాజు తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
ఖమ్మంఅర్బన్: నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద అక్రమంగా ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని సీఐ భానుప్రకాష్ తెలిపారు.
పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
చండ్రుగొండ: మండలంలోని బాలికుంట గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లతో కలకలం రేకెత్తించింది. వివరాలిలా ఉన్నాయి.. బాలికుంట పాఠశాలకు సోమవారం ఉదయం విద్యార్థులతోపాటు ఉపాధ్యాయుడు రవికుమార్ హాజరయ్యారు. పాఠశాల భవనం వరాండాలో పసుపు, కుంకుమతోపాటు నిమ్మకాయ, ఎండుమిర్చి, ముగ్గు వేసి ఉండటంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. గ్రామస్తులు పాఠశాలకు చేరుకోగా.. హెచ్‌ఎం రవికుమార్ వాటిని శుభ్రం చేయంచి పాఠశాల ప్రారంభించారు. సమాచారం అందుకున్న ఎంఈఓ సత్యనారాయణ, పోలీసులు పాఠశాలను సందర్శించారు. ఒకరోజు ముందు ఆదివారం కావడంతో ఎకరో ఆకతాయిలు ఇలా చేసి ఉంటారని ఎంఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment