
జ్యూయలరీ దుకాణంలో చోరీ
చర్ల: మండల కేంద్రంలోని జ్యూయలరీ దుకాణంలో చోరీ జరిగిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి మెయిన్‌రోడ్‌లోని శ్రీలక్ష్మీ నర్సింహ జ్యూయలరీ దుకాణం తాళాలు పగులగొట్టేందుకు యత్నించగా.. అవి పగలక పోవడంతో అక్కడి నుంచి భద్రాద్రిరామా జ్యూయలరీ దుకాణం వద్దకు వచ్చారు. తాళాలు పగలగొట్టి 3 కిలోల వెండి వస్తువులు, చిన్న బంగారు వస్తువులు, రూ.15 వేల నగదు, వెయిట్ మిషిన్లను చోరీ చేశారు. మొత్తం సొత్తు విలువ రూ.1.95 లక్షలు ఉంటుందని యజమాని పందిళ్లపల్లి శంకరాచారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ వి.కేశవ్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి ఎస్‌ఐతోపాటు క్లూస్ టీం చేరుకుని వివరాలను సేకరించింది.
Comments
Please login to add a commentAdd a comment