
కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు
ఖమ్మంమయూరిసెంటర్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నారులకు కంటి పరీక్షలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం కంటి పరీక్షలు ప్రారంభించారు. గతేడాది ఏప్రిల్, సెప్టెంబర్‌లో రెండు పర్యాయాలు 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 71,086 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా అందులో జిల్లా వ్యాప్తంగా 3,350 మంది విద్యార్థులకు వివిధ రకాల కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వారికి జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, నేలకొండపల్లి ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రోజూ 150 మందిని పరీక్షించనున్నారు. సాధారణ సమస్యలకు జిల్లాలోనే వైద్య సేవలు అందిస్తుండగా, తీవ్రంగా ఉన్న విద్యార్థులను హైదరాబాద్ తరలించి చికిత్స అందించనున్నారు.
ఈజీఎస్ జాబ్ కార్డులు అప్‌డేట్ చేయాలి
ఎర్రుపాలెం: ఈజీఎస్ కూలీల జాబ్ కార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అడిషనల్ డీఆర్‌డీఓ చుంచు శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ఈజీఎస్ కార్యాలయంలో నిర్వహించిన సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంలో ఆయన మాట్లాడారు. తొలుత 2023 ఏప్రిల్ నుంచి మార్చి 2024 వరకు ఈజీఎస్ ద్వారా మండలంలో చేపట్టిన పనుల వివరాలను ఓపెన్ ఫోరంలో గ్రామాల్లో ఆడిట్ జరిపిన 12 బృందాల నివేదికలను చదివి వినిపించారు. కూలీల హాజరు – కొలతల్లో గమనించిన తేడాలను వెంటనే రికవరీ చేయాలని సంబంధిత అధికారులను అడిషనల్ డీఆర్‌డీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. సమావేశంలో జిల్లా విజిలెన్స్ అధికారి టి.సక్రియానాయక్, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి వీరయ్య, అంబుడ్స్‌మెన్ రమేశ్‌బాబు, ఎంపీడీఓ సురేందర్, ఏపీఓ కె.నాగరాజు, విజిలెన్స్ సూపరింటెండెంట్ వీవీఎస్ శాస్త్రి, అసిస్టెంట్ మేనేజర్ పవన్, ఎస్‌ఆర్‌పీ సాంబశివాచారి, ఎంపీఓ జి.శ్రీలక్ష్మి, ఆర్‌ఐ బి.రాజశేఖర్, పీఆర్ ఏఈ నరేశ్ తదితరులున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు సత్తాచాటాలి
ఖమ్మంమామిళ్లగూడెం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని రిటైర్డ్ ఐఏఎస్, మేధావుల సంఘం చైర్మన్ చిరంజీవులు పిలుపునిచ్చారు. ఐక్య వేదిక సమావేశం ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన ఖమ్మంలో నిర్వహించగా చిరంజీవులు పాల్గొని మాట్లాడారు. తాను 1931 జనగణనను అధ్యయనం చేశానని, ఇటీవల రాష్ట్రంలో జరిగిన జనగణనలో బీసీల జనాభాను తగ్గించి ఓసీల జనాభాను పెంచారని తెలిపారు. 8 శాతం ఉండాల్సిన ఓసీ జనాభా 13 శాతానికి పెంచి.. 56 శాతం ఉండాల్సిన బీసీ జనాభాను 46 శాతానికి తగ్గించినట్లు వివరించారు. బీసీలంతా ఏకమై హక్కుల సాధనలో రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కూరపాటి వెంకటేశ్వర్లు, బొమ్మా రాజేశ్వరరావు, కత్తి నెహ్రూగౌడ్, పసుపులేటి నర్సయ్య, పద్మ, డాక్టర్ కేవీ కృష్ణారావు, షేక్ షకీన, సోమరాజ్, రాంబాబు, మాటేటి కిరణ్, పెళ్లూరి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్రవాహనం చోరీ
రఘునాథపాలెం: మండలంలోని రాంక్యాతండాకు చెందిన ఈ.రమేశ్ ద్విచక్రవాహనం చోరీకి గురికాగా.. సోమవారం రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఉస్మాన్‌షరీఫ్ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి రమేశ్ గ్రామ సెంటర్‌లో ఉన్న సెలూన్‌లో హెయిర్ కటింగ్ చేయించుకుని బయటకు రాగా.. ద్విచక్రవాహనం కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు

కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు

కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు
Comments
Please login to add a commentAdd a comment