
జ్యూయలరీ దుకాణంలో చోరీకి యత్నం..
దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలోని ఝూన్సీ జ్యూయలరీ దుకాణంలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఓ దొంగల మూఠా బొలేరో వాహనంలో లక్ష్మీనగరం గ్రామంలోని ఝూన్సీ జ్యూయలరీ దుకాణంలో దొంగతనానికి ప్రయత్నించింది. దుకాణం షెట్టర్ తొలగించి లోపలి కౌంటర్‌ను తోయగా ఆ శబ్దం విన్న వెనుక అద్దెకు ఉండేవారు నిద్ర లేచి బయటకు రావడంతో వారు పరారయ్యారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్, ఎస్‌ఐలు వెంకటప్పయ్య, గణేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన క్లూస్ టీం సభ్యులు ఆధారాలను సేకరించారు. జ్యూయలరీ దుకాణంలో ఏమీ చోరీకి గురికాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
పక్కా స్కెచ్..
దొంగలు లక్ష్మీనగరం గ్రామంలోని జ్యూయలరీ దుకాణంలో చోరీ చేసేందుకు పక్కా ప్రణాళికతో వచ్చినట్లు సీసీ కెమెరాల ఆధారంగా తెలుస్తోంది. భద్రాచలం వైపు నుంచి బొలేరో వాహనం చర్ల వైపు వెళ్తూ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చి ఓ స్వీట్ షాప్ దగ్గర నిలిపి, అక్కడి నుంచి దొంగలు ఝూన్సీ జ్యూయలరీ దుకాణం వద్దకు వెళ్లినట్టు సీసీ కెమెరాలో కనిపిస్తోంది. వాహనంలో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి జ్యూయలరీ దుకాణం వ్దకు వెళ్లగా వాహనం రివర్స్‌లో దుకాణం వద్దకు వెళ్లింది. షట్టర్ తొలగించి కౌంటర్‌ను తోయడం.. వెనుక ఉన్న వాళ్లు లేవడం.. దొంగలు పరారుకావడం కూడా నిఘా నేత్రాల్లో నిక్షిప్తమైంది. అనంతరం వారు వెళ్తూ కూడా టార్చిలైట్ వేసి దుకాణాలను పరిశీలించి వెళ్లారు. తొలుత అర్ధరాత్రి 2.01 గంటలకు సాయితిరుమల ఇంజనీరింగ్ వర్క్స్ దుకాణం వద్దకు వెళ్లారు. మరోసారి 3.28 గంటలకు సమయంలో మరోసారి ఆ దుకాణం వద్దకు వెళ్లగా లోపల నిద్రిస్తున్న వ్యక్తులు లేవగా హిందీలో తాగునీరు కావాలని అడిగినట్టు తెలిసింది.
అద్దెకున్న వాళ్లు లేవడంతో ప్రయత్నం విఫలం

జ్యూయలరీ దుకాణంలో చోరీకి యత్నం..
Comments
Please login to add a commentAdd a comment