
లారీ క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్
వైరా: ఆగి ఉన్న లారీ క్యాబిన్‌లో ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. వైరా మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ వద్ద సోమవారం ఉదయం కోల్‌కతా నుంచి మిర్యాలగూడెంనకు తౌడు లోడుతో వెళ్తూ ఆగింది. ఆ సమయంలో లారీ క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. స్థానికులు ఆగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్‌తో క్యాబిన్ దగ్ధమై సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లినట్లు డ్రైవర్ తెలిపారు.
గల్లంతైన వ్యక్తి విగతజీవిగా..
భద్రాచలంఅర్బన్: గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకిన ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. వివరాలివీ.. కొత్తగూడెం పట్టణానికి చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు వేముల మల్లేశ్ (68) ఇంట్లో గొడవపడి ఆదివారం ఉదయం భద్రాచలం వచ్చి గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అదే రోజు మృతదేహం దొరక్క పోవడంతో సోమవారం గజ ఈతగాళ్లు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం దొరకడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
కార్మికుడు అదృశ్యం
ఖమ్మంఅర్బన్: నగరంలోని పాండురంగాపురంలో ఉంటూ పాలిష్ కార్మికుడిగా పనిచేస్తున్న బాలకృష్ణ కనిపించకుండా పోవడంతో సోమవారం ఖమ్మంఅర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గత నెల 23న పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని, అనేక చోట్ల ఆరా తీసినా ఆచూకీ లభించలేదని.. బాలకృష్ణ అత్త కోటమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె, అల్లుడు పుట్టుకతో మూగవారని తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లారీ క్యాబిన్‌లో షార్ట్ సర్క్యూట్
Comments
Please login to add a commentAdd a comment