
గిరిజనుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
భద్రాచలం: గిరిజన దర్బార్‌లో ఇచ్చే ఫిర్యాదులను అర్హత మేరకు సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అధికారులకు సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన దరఖాస్తులను స్వీకరించారు. గిరిజనుల సమస్యలు తెలుసుకొని సంబంధిత యూనిట్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. ఐటీడీఏకు వచ్చే గిరిజనుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం సింగరేణి మండలానికి చెందిన బాలు తమ గ్రామానికి కరెంట్ కనెక్షన్ ఇప్పించాలని, ములకలపల్లి మండలం చింతపేట రైతులకు బోర్లు, కరెంటు మోటార్లు ఇప్పించాలని, అశ్వారావుపేట మండలం తిరుమలకుంటలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మించాలని ఆ గ్రామస్తులు వినతిపత్రాలు సమర్పించారు. ఇంకా గుండాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వెంకయ్య సోలార్ విద్యుత్‌తో బోర్ కనెక్షన్ ఇవ్వాలని.. ఇలా పలువురు దరఖాస్తులు అందజేయగా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. దర్బార్‌లో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఎస్‌డీసీ రవీంద్రనాథ్, ఈఈ చంద్రశేఖర్, ఏఓ సున్నం రాంబాబు, ఎస్‌ఓ భాస్కరన్, ఏపీఓ వేణు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, ఎల్‌టీఆర్ డీటీ మనిధర్, మేనేజర్ ఆదినారాయణ, గురుకులం ఏఓ నరేందర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అనసూయ, హెచ్‌ఈఓ లింగానాయక్, జేడీఎం హరికృష్ణ, మిషన్ భగీరథ ఏఈఈ నారాయణరావు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment