కనకగిరి అడవుల్లో జీవ వైవిధ్యం
ఖమ్మంవన్‌టౌన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్న కనకగిరి రిజర్వు ఫారెస్ట్ జీవ వైవిధ్యానికి చిరునామాగా మారింది. వన్యప్రాణి నిపుణులు ఆదివారం ఈ అడవిలో 12 గంటల పాటు కాలి నడకన పర్యటించారు. ఈ సందర్భంగా బ్లూ – ఇయర్డ్ కింగ్‌ఫిషర్ (లకుముకిపిట్ట)ను గుర్తించారు. జిల్లాలోని సత్తుపల్లి డివిజన్ తల్లాడ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో చేపట్టిన ఈ వాక్‌లో వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 12 మంది వన్యప్రాణి నిపుణులు నాలుగు కిలోమీటర్ల అడవిని అన్వేషించి.. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఇక మిగిలిన పక్షులలో బ్లాక్–వింగ్డ్ ష్రైక్, రూఫస్ వడ్రంగిపిట్ట, వైట్–రంప్డ్ మునియా, బ్లూ–థ్రోటెడ్ బ్లూ ఫ్లైక్యాచర్, బ్లాక్–రంప్డ్ షామా ఉన్నాయి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైల్డ్ తెలంగాణ నుంచి ప్రదీప్ ప్రాజ్, మీరాకి ఆర్గనైజేషన్ నుంచి నవీన్ బాలా, ఎ.సుజిత్, వి ఊల్ఫ్ ఫౌండేషన్ నుంచి పి.హరికృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కనకగిరి అడవుల్లో జీవ వైవిధ్యం
Comments
Please login to add a commentAdd a comment