గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.6.49 కోట్ల ఆద
● కార్గోకు నానాటికీ పెరుగుతున్న ఆదరణ ● జిల్లా నుంచి హైదరాబాద్‌కు హోం డెలివరీ సౌకర్యం ● త్వరలోనే ఉమ్మడి జిల్లాలో అమలుకు కార్యాచరణ
2024, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కార్గోకు వచ్చిన ఆదాయం వివరాలు (రూ.లలో)
నెల పార్శిల్స్ ఆదాయం
ఏప్రిల్ 29,244 57,04,840
మే 35,199 68,46,890
జూన్ 30,458 60,61,210
జూలై 29,384 56,12,285
ఆగస్ట్ 30,358 58,01,695
సెప్టెంబర్ 27,809 53,90,575
అక్టోబర్ 31,650 61,64,170
నవంబర్ 32,896 66,24,995
డిసెంబర్ 33,588 68,97,835
జనవరి 32,287 64,94,285
ఫిబ్రవరి 16,870 33,31,860
(ఇప్పటివరకు)
కొరియర్ సర్వీస్‌కు బ్రాండ్..
2020 జూన్ 19న కార్గో సేవలు ప్రారంభించారు. అప్పటి నుంచి పార్శిళ్లను గమ్యస్థానాలకు చేర్చడంలో వినియోగదారుల నమ్మకాన్ని సంస్థ చూరగొంది. దీంతో ఇక్కడ సేవలు పొందే వారి సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తోంది. చిన్న కవర్ల నుంచి పెద్ద పార్శిళ్లు, కంప్యూటర్లు, వ్యవసాయ పనిముట్లు, ఇతర సామగ్రి ఏదైనా కార్గోలో సురక్షితంగా, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుతోంది. దీంతో అందరూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రైవేట్ కొరియర్ సర్వీసుల చిరునామాలకు ఇబ్బంది పడాల్సి రావడం, కొన్ని వస్తువులను వారు అంగీకరించకపోవడంతో అందరూ కార్గో బాట పట్టారు. ఈ సేవలు ఆర్టీసీ బస్టాండ్లలో లభిస్తుండటంతో అడ్రస్ కోసం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎవరికై నా పార్శిల్ పంపించాలంటే మొదట గుర్తొచ్చేది కార్గోనే అనేలా కొరియర్ సర్వీస్‌కు బ్రాండ్‌గా మారింది.
ఏడాదిలో రూ.6.49 కోట్లు..
టీజీఎస్ ఆర్టీసీకి కార్గో ఆదాయ వనరుగా మారింది. ఈ సేవలను ప్రారంభించిన తొలి ఏడాదిలో రూ.1.71 కోట్లు రాగా.. ఆ తర్వాత ప్రతి ఏడాది ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2023 –24లో రూ.7.24 కోట్లు వచ్చింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3,29,743 పార్శిళ్ల బుకింగ్ ద్వారా రూ.6,49,30,640 ఆదాయం వచ్చింది. ఖమ్మం రీజియన్‌లోని ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, మధిర, ఇల్లెందు డిపోల నుంచి ఇతర ప్రాంతాలకు, అక్కడి నుంచి ఇక్కడికి పార్శిళ్లు వస్తుంటాయి. అయితే ఆదాయం పెరగడంలో కార్గో సిబ్బందితో పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కృషి ఎంతో ఉంది. అత్యధికంగా మేలో జిల్లాలో 35,199 పార్శిళ్ల బుకింగ్ ద్వారా రూ.68,46,890 వచ్చాయి. అలాగే డిసెంబర్‌లో 33,588 పార్శిళ్ల ద్వారా రూ.68,97,835 ఆదాయం లభించింది. అలాగే ఇతర ప్రాంతాలకు 1,740 పార్శిళ్లు హోం డెలివరీ ద్వారా కార్గో రూ.4,84,050 ఆదాయం పొందింది.
త్వరలో ఇక్కడా హోం డెలివరీ..
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మాత్రమే హోం డెలివరీ సౌకర్యం ఉండగా త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అవకాశాన్ని కల్పిస్తాం. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. హోం డెలివరీ సౌకర్యంతో వినియోగదారులకు మరింతగా సేవలు అందుబాటులోకి రానున్నాయి.
– వి.రామారావు, మేనేజర్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాజిస్టిక్స్
కచ్చితమైన సేవలు..
ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా వస్తువులను పంపించడం సులువుగా మారింది. పార్శిల్ ఇవ్వగానే ఆర్టీసీ బస్ ద్వారా పంపుతుండగా వేగంగా గమ్యస్థానాలకు చేరుతున్నాయి. బుక్ చేసిన వెంటనే, డెలివరీ అయిన తర్వాత సెల్‌కు మెసేజ్ వస్తుండడంతో ఎలాంటి భయం లేకుండా పోతోంది. ఖరీదైన వస్తువులను కూడా కార్గో ద్వారా పంపించేందుకు ఎవరూ వెనుకాడడం లేదు. ఆర్టీసీ సంస్థ సైతం వినియోగదారులకు జవాబుదారీగా వ్యవహరిస్తూ ఎలాంటి రిమార్క్ లేకుండా సేవలందిస్తోంది.
గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.6.49 కోట్ల ఆద
Comments
Please login to add a commentAdd a comment