చింతకాని : మండల పరిధిలోని నేరడలో గల ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అసెస్‌మెంట్ స్టాండర్డ్ (ఎన్‌క్వాస్) బృందం సభ్యులు డాక్టర్ కుమార్ భార్గవ్, డాక్టర్ పుష్పలత సోమవారం వర్చువల్‌గా తనిఖీ చేశారు. ఎన్‌క్వాస్ నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్య కేంద్రంలో ఏడు విభాగాలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా నుంచి అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి రామారావు, జిల్లా ప్రోగ్రాం అధికారి దుర్గ, మండల వైద్యాధికారులు డాక్టర్ ఆల్తాఫ్, సాయికుమార్, సీహెచ్‌ఓ వీరేందర్, పల్లె దవాఖానా వైద్యులు సోహెల్, హెల్త్ సూపర్‌వైజర్లు కృష్ణారావు, నాగేశ్వరరావు, రేచల్‌రాణి, జ్యోతి రత్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment