కాంగ్రె్‌స్ పాలనలోనే గిరిజన సంక్షేమం
కూసుమంచి: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే గిరిజనులకు సంక్షేమం అందుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కూసుమంచిలో సోమవారం నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హింస, కరుణ, మద్యపాన నిషేధం తదితర అంశాలపై సేవాలాల్ సమాజ హితానికి పాటుపడ్డారని, మానవుడి రూపంలో ఉన్న భగవంతుడిగా మారారని అన్నారు. ఆయన సిద్ధాంతాలను నేటి తరం వారు ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి మహనీయుడి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆదివాసీల గౌరవాన్ని పెంచేలా కృషి చేస్తోందని చెప్పారు. ఇందిరా గాంధీ పాలనలోనే బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, దీంతో కలిగిన రిజర్వేషన్‌తో నేడు గిరిజనులు విద్య, ఉద్యోగావకాశాలు పొందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి గిరిజనులకు మధ్య బంధం విడదీయలేమని, ఇందిరమ్మ రాజ్యంలో గిరిజనులు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తామంతా శ్రమంచి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఈ సందర్భంగా పొంగులేటిని గిరిజన పెద్దలు తలపాగా చుట్టి గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బాణోత్ శ్రీనివాస్ నాయక్, బోడ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ సిద్ధాంతాలను ఆచరించాలి
రెవన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
Comments
Please login to add a commentAdd a comment