ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటుంది
ఖమ్మంమయూరిసెంటర్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సోమవారం ఖమ్మంలోని ఓ హోటల్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డి, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయుల ఓట్లతో శాసనమండలికి వెళ్లిన ఎమ్మెల్సీలు టీచర్ల సమస్యలపై ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో సరోత్తంరెడ్డిని గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. తొలుత బీజేపీ జిల్లా నాయకులు ఈటలకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సరోత్తంరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment