కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి
● తెలంగాణ కోసం 35 పార్టీలను కేసీఆర్ ఏకం చేశారు ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంమయూరిసెంటర్ : కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయన కేక్ కట్ చేయడంతో పాటు మమత ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాధనకు 35 పార్టీలను ఏకం చేసి పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో గురుకుల పాఠశాలల్లో చేరేందుకు కొన్ని వేల దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు సరైన సదుపాయాలు లేక దుర్భర పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు ఆర్‌జేసీ కృష్ణ, టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, వీరునాయక్, కొల్లు పద్మ, షకీనా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment