నేడు స్తంభాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం
2 కి.మీ. యాత్ర అనంతరం
దివ్యజ్యోతి దర్శనం
ఖమ్మంగాంధీచౌక్ : త్రేతాయుగం నాటి స్వయంభు దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి(గుట్ట) సన్నిధిలోని కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం మంగళవారం ప్రారంభం కానుంది. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5:30 గంటలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్ఛరణల నడుమ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. నృసింహ నామ స్మరణ, కీర్తనలు ఆలపిస్తూ నిర్వహించే ఈ కార్యక్రమంలో కోలాట బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రదక్షిణ అనంతరం 6:30 గంటలకు కొండ మీద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై దివ్య జ్యోతి దర్శనం చేసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు. గిరి ప్రదక్షిణ స్తంభాద్రి ఘాట్ రోడ్ గేటు వద్ద ప్రారంభమై ఎన్‌ఎస్‌పీ రోడ్, కవిత డిగ్రీ, పీజీ కళాశాల, స్తంభాద్రి మండపం, సరిత క్లినిక్, ఎల్‌ఐసీ కార్యాలయం మీదుగా తిరిగి గేటు నుంచి ఘాట్ రోడ్ ద్వారా గుట్టపై ఉన్న నృసింహుని ఆలయానికి చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment