ఆర్థోపెడిక్ వైద్యుడికి ఉత్తమ అవార్డు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న హనుమాన్ ఉత్తమ డాక్టర్ అవార్డు పొందారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఈ నెల 13 నుంచి 16 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్థోపెడిక్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. రోడ్డు ప్రమాదంలో విరిగిన కాలు ఎముకలకు ఇతర పద్ధతుల్లో రాడ్లు వేసే ఆపరేషన్ల గురించి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. చీము పట్టినప్పుడు ఎముకలను తీసేయకుండా చేస్తున్న ఇలిజారోవ్ ఆపరేషన్ల గురించి వివరించారు. ఈ ప్రెజెంటేషన్‌కు గాను ట్రామా విభాగంలో బెస్ట్ డాక్టర్ అవార్డు లభించింది. ఈ సందర్బంగా హనుమాన్‌ను కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, సూపరింటెండెంట్ ఎల్. కిరణ్‌కుమార్ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment