
కంటి పరీక్షల శిబిరాన్ని పరిశీలించిన డీఎంహెచ్‌ఓ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి.కళావతిబాయి మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పలువురికి స్వయంగా పరీక్షలు చేసిన ఆమె వైద్యులతో సమీక్షించారు. కంటి సమస్యలు ఉన్న వారికి రెండో విడత పరీక్షల అనంతరం అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎవరికై నా ఆపరేషన్ అవసరమైతే హైదరాబాద్ పంపిస్తామని చెప్పారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చందునాయక్, డెమో సాంబశివరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment