
పీహెచ్‌సీలో కేంద్ర బృందం తనిఖీ
ముదిగొండ: ముదిగొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని వైద్య ఆరోగ్య అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె.శశిశ్రీతో పాటు కేంద్రప్రభుత్వ టాస్క్‌పోర్స్ టీమ్ సభ్యులు మంగళవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించాక మందుల నిల్వలు, టీకాలపై ఆరాతీశారు. ఆరోగ్యకేంద్రంలోని ఫార్మసీకి సరఫరా అయిన మందులు, పంపిణీపై వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆతర్వాత వైద్యసేవపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్‌కుమార్, కుత్బుల్లాపూర్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి, డీపీఓ దుర్గ, వైద్యాదికారి డాక్టర్ అరుణాదేవి, ఉద్యోగులు మోహన్, ఖాదర్‌బీ, సత్యవతి, రాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment