కబడ్డీ ఎంపిక పోటీలకు 195మంది హాజరు
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్ల ఎంపికకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన పోటీలకు మంచి స్పందన లభించింది. కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలకు బాలురు 120 మంది, బాలికలు 75 మంది హాజరయ్యారు. వీరిని జట్లుగా విభజించి పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబర్చిన వారితో జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి టి.దయాకర్‌రెడ్డి, కె.క్రిస్టోఫర్‌బాబు, డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డితో పాటు సుధాకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment