చింతకాని: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26నుంచి మండలంలోని నేరడలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని నేతాజీ యువజన సంఘం కార్యదర్శి దూసరి గోపాలరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జట్ల బాధ్యులు రూ.500 ఎంట్రీ ఫీజు చెల్లించి ఈనెల 25వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచేవారికి వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30వేలతో పాటు ఎనిమిదో స్థానం వరకు నిలిచే జట్లకు సైతం నగదు బహుమతులు అందజేస్తామని తెలి పారు. వివరాలకు క్రీడాకారులు 70939 00119, 93945 71739, 80084 92173 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment