మిర్చిబోర్డు ఏర్పాటు చేయాల్సిందే...
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర స్థిరీకరణ కోసం ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ధర్నా నిర్వహించారు. నానాటికీ మిర్చి ధర పతనమవుతున్నందున రైతులు నష్టపోకుండా ఇతర పంటల మాదిరి మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఈసందర్భంగా సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మిర్చి ధర స్థిరీకరణకు మిర్చిబోర్డు ఆవశ్యమని తెలిపారు. ఈ బోర్డునుఖమ్మంలో ఏర్పాటుచేసిన క్వింటాకు రూ.25 వేలు చెల్లించేలా మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా కొనుగోళ్లు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, జిల్లాలో ముగ్గురు రాష్ట్రమంత్రులు ఉన్నందున ఈ విషయంలో స్పందించాలన్నారు. అలాగే, సీపీఐ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యాన కూడా నిరసన తెలపగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు మాట్లాడారు. మిర్చి ధర పతనానికి పాలకులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మిర్చిబోర్డు ఏర్పాటుతోనే రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈవిషయంలో స్పందించకపోతే మార్కెట్లోలో లావాదేవీలను స్తంబింపచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు యర్రా శ్రీకాంత్, మాదినేని రమేష్, భూక్యా వీరభద్రం, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, యల్లంపల్లి వెంకట్రావు, తాతా భాస్కర్‌రావు, కొక్కెర పుల్లయ్య, దండి సురేష్, మహ్మద్ మౌలానా, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, యర్రా బాబు, శింగునర్సింహారావు, పోటు కళావతి, మిడికంటి చిన్న వెంకటరెడ్డితో పాటు మిర్చి తీసుకొస్తున్న రైతులు కూడా పాల్గొన్నారు. కాగా, మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హన్మంతరావు వారితో చర్చించి త్వరలోనే అధికారులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సీపీఎం, సీపీఐ అనుబంధ సంఘాల ఆధ్వర్యాన ధర్నా
క్వింటాకు రూ.25 వేలు
చెల్లించాలని డిమాండ్
మిర్చిబోర్డు ఏర్పాటు చేయాల్సిందే...
Comments
Please login to add a commentAdd a comment