వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం గంగారం పంచాయతీ జలగంనగర్‌కు చెందిన కంచి రాధాకృష్ణ(30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గంగారంలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకున్నాడు. ఈమేరకు సత్తుపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియకపోగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, రాధాకృష్ణకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
ఆరుగురు వాహన
యజమానులపై కేసు
చింతకాని: సరుకు రవాణాకు వినియోగించే బోలెరో వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆరు వాహనాల యజమానులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు. బోనకల్ నుంచి బోలెరో వాహనాల్లో కూలీలను ఎక్కించుకుని నాగులవంచ వైపు వస్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా జరిగే ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించి, వాహన యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment