అర్హత లేదు.. అనుమతులూ లేవు
ఖమ్మంవైద్యవిభాగం: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆక్యూ పంక్చర్ ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి సీజ్ చేశారు. ఖమ్మం కమాన్‌బజార్‌లోని పెయిన్ రిలీఫ్ ఆక్యూ పంక్చర్ ఆస్పత్రిని డీఎంహెచ్‌ఓ మంగళవారం తనిఖీ చేశారు. ఆ సమయంలో డాక్టర్‌గా వ్యవహరిస్తున్న పి.విజయభాస్కర్ లేకపోగా, ఆయనకు అర్హత లేదని, రిజిస్ట్రేషన్ లేకుండానే ఆస్పత్రి నడుపుతున్నట్లు తేలడంతో సీజ్ చేయించచారు. తగిన అర్హతలు లేకుండా వైద్యం చేయడం నేరమని, ఒకవేళ అర్హత ఉన్నా ఆలోపతిక్ చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేయింకున్నాక ప్రాక్టీస్ చేయాలని ఆమె స్పష్టం చేశారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు, సీహెచ్‌ఐ పీఓ చందునాయక్, డెమో సాంబశివరెడ్డి పాల్గొన్నారు.
ఆక్యూ పంక్చర్ ఆస్పత్రి సీజ్
Comments
Please login to add a commentAdd a comment