కొనసాగుతున్న రాజీవ్‌గాంధీ స్మారక క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీ స్మారక జిల్థాస్థాయి క్రికెట్ టోర్నీ కొనసాగుతుంది. ఈమేరకు బుధవారం కొత్తగూడెం రూరల్ – కిన్నెరసాని పాల్వంచ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కొత్తగూడెం రూరల్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కిన్నెరసాని పాల్వంచ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో భైరవ్‌సర్కార్ 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన కొత్తగూడెం రూరల్ జట్టు 14 ఓవర్లలోనే 133 పరుగుల చేయగా విజయం సాధించింది. ఈ జట్టులో అశోక్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత మ్యాచ్‌ను డాక్టర్ గ్రీష్మ ప్రారంభించారు. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్‌తో పాటు రాజేష్, భరత్, లింగేష్, రాజారమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment