ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..
చింతకాని: నాగపూర్ – అమరావతి జాతీయ రహదారి నిర్మాణంతో భూమి కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని కొదుమూరులో భూ నిర్వాసిత రైతులతో ఆర్డీఓ నర్సింహారావు బుధవారం సమావేశమయ్యారు. అయితే, ఎకరాకు రూ.25 లక్షలే జమ చేశారని, మార్కెట్ ధర ప్రకారం రూ.50 లక్షలు చెల్లించడంతోపాటు పొలాలకు వెళ్లేందుకు అండర్ పాస్, సర్వీస్ రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, వ్యవసాయ బావులు, దీర్ఘకాలిక పంటలకు సైతం పరిహారాన్ని అందించాలన్నారు. అప్పటివరకు రహదారి నిర్మాణ పనులు చేయనిచ్చేది లేదని రైతులు స్పష్టం చేయగా, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ తెలిపారు. తహసీల్దార్ కూరపాటి అనంతరాజుతో పాటు వివిధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment