ఏకగ్రీవంగా హెచ్‌డబ్ల్యూఓల కార్యవర్గం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ వసతిగృహ సంక్షేమ అధికారుల(హెచ్‌డబ్ల్యూఓ) సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఖమ్మంలోని టీఎన్జీవోస్ భవన్‌లో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్, హెచ్‌బ్ల్యూఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డీ.గౌస్ హష్మీ ఆధ్వర్యాన బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోటపాటి రుక్మారావు, కార్యదర్శిగా నెల్లూరి నాగేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులుగా బజ్జురి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కంభం తిరుపతిరావును ప్రకటించారు. అలాగే, ఉపాధ్యక్షులుగా కె.వీరభద్రరావు, ఎస్.వెంకట్‌రెడ్డి, ఎం.కోమలితో పాటు వివిధ పదవులకు కె.వెంకటేశ్వరరావు, ఆర్.నాగరాజు, పి.మాధురి, సీహెచ్.నాగమణి, జి.వినోద, ఐ.జ్యోత్స్న, టి.స్టాలిన్, జి.వెంకటేశ్వర్లు, ఎం.వెంకటకృష్ణ, పి.కృష్ణకిరణ్, జె.నర్సింహారావు ఎన్నికయ్యారని వెల్లడించారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ హస్మి మాట్లాడుతూ హాస్టళ్లకు బిల్లులు, ఇతర సమస్యలను టీఎన్జీవోస్ సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈసమావేశంలో కె.దుర్గాప్రసాద్, తాళ్లూరి శ్రీకాంత్, వై.రమేష్, కరణ్ సింగ్, బి.చంద్రశేఖర్, రాధాకృష్ణ, శ్రీధర్‌సింగ్, వై.శ్రీనివాసరావు, అస్లాం, ఎన్.విజయ, ఎం.వీరన్న, కృష్ణ, మాధవ్‌గౌడ్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment