రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
సత్తుపల్లిరూరల్/దమ్మపేట: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో బుధవారం జరిగింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడేనికి చెందిన కేతేపల్లి జానకీరాం బైక్‌పై పట్వారిగూడెం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తుండగా.. దమ్మపేట మండలం జగ్గారానికి చెందిన మడివి నాగేంద్రబాబు, వగ్గెల లక్ష్మణ్ మరో ద్విచక్రవాహనంపై జగ్గారం వెళ్తున్నారు. మార్గమధ్యలోని గండుగులపల్లిలో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా లక్ష్మణ్, జానకీరాం, నాగేంద్రబాబుకు తీవ్రగాయాలు కావడంతో 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, జానకీరాం, లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. కాగా, క్షతగాత్రులను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన సమయాన సిబ్బంది ఒక్కరే ఉండడంతో వారిని లోపలకు తీసుకెళ్లేందుకు 20 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అంతసేపు క్షతగాత్రులు అవస్థ పడ్డారు.
సిబ్బంది లేక అంబులెన్స్‌లోనే 20 నిమిషాలు
Comments
Please login to add a commentAdd a comment