నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తాం
సత్తుపల్లి: మండలంలోని సింగరేణికి చెందిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ద్వారా వస్తున్న దుమ్ముదూళితో స్థానికులు పడుతున్న ఇబ్బందులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, ఈ.వీ.రమేష్ తెలిపారు. ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నామని కిష్టారం అంబేద్కర్‌నగర్ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని బుధవారం వారు సందర్శించారు. అక్కడి నుంచే సింగరేణి సీఎండి బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో మాట్లాడి సమస్యను వివరించారు. సీహెచ్‌పీ ద్వారా వచ్చే దుమ్ముదూళితో కిష్టారం, లంకపల్లి, జలగంనగర్, రేజర్ల, ఎన్టీఆర్‌నగర్, వెంగళరావునగర్, చౌడవరం వాసులు ఇబ్బంది పడుతున్నందున సింగరేణి అధికారులు స్పందించాలన్నారు. కాగా, సింగరేణి సీఎండీ బలరాం స్పందించి ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరంరాజు, సుదర్శన్ మిశ్రా, మట్టా ప్రసాద్, పాలకొల్లు శ్రీనివాస్, విజయ్, వసంతరావు, రెహమతుల్లా, శేషగిరి, శివ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment