రూ.11.58 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మంలో రైల్వేస్టేషన్ నుంచి ముంబై తరలించడానికి సిద్ధంగా ఉన్న గంజాయిని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జీఆర్పీ సీఐ అంజలి, డోర్నకల్ ఎస్‌ఐ సురేష్ మంగళవారం సాయంత్రం ఖమ్మం స్టేషన్‌లో తనిఖీ చేస్తుండగా రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై రెండు సూట్‌కేసులతో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆయన వద్ద సోదా చేయగా రూ.11.58లక్షల విలు వైన 46కేజీల గంజాయి లభ్యమైంది. మహారాష్ట్రలోని పర్బనీ జిల్లాకు కార్మికుడైన ఆయన తేలికగా డబ్బు సంపాదించడానికి ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ముంబైలో అమ్మడానికి వెళ్తున్నట్లుగా తేలింది. ఈమేరకు నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అంజలి తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment