ప్రమాదవశాత్తు కాల్వలో పడి హోంగార్డు మృతి
నేలకొండపల్లి: కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన హోంగార్డు ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడడంతో మృతి చెందాడు. నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్న గంటా నరేష్(37) గురువారం ఉదయం నందిగామ బ్రాంచి కెనాల్ వద్ద కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. బైక్, దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్ కాల్వ కట్టపై ఉంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో కాల్వలో పడిపోయాడు. అయితే, నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో హైడల్ పవర్ ప్రాజెక్ట్ వరకు కొట్టుకెళ్లిన ఆయన ఊపిరాడక మృతి చెందాడు. ఆతర్వాత లాక్‌ల వద్ద మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకుని బయటకుతీయించారు. ఆయనకు భార్య నాగశ్రీతో పాటు ఇద్దరు పిల్లలు ఉండగా, భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కూసుమంచి, ముదిగొండ సీఐలు సంజీవ్, మురళి, ఎస్సైలు సంతోష్, లక్ష్మణ్‌రావు, నవీన్, రవి, గౌతమ్, హోంగార్డు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్ తదితరులు నరేష్ మృతదేహం వద్ద నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment