ఇంకొందరికి తోడ్పాటునివ్వాలి
● అటు అందం.. ఇటు సందేశం
వాల్ ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేయిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై వేయిస్తున్న ఈ పెయింటింగ్‌లు అందంగానే కాక ఆలోచింపచేసేలా ఉంటున్నాయి. మొక్కల ఆవశ్యకత, వనాలు లేకపోతే ఎదురయ్యే అనర్ధాలు, పల్లె వాతావరణం, రైతులతో కూడిన చిత్రాలే కాక సైనికుల చిత్రాలు వేయిస్తున్నారు. అలాగే, స్టేడియం వద్ద గోడలపై ప్రముఖ క్రీడాకారుల చిత్రాలు వేయిస్తూ ఔత్సాహిక క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మంలోని బస్‌డిపో రోడ్డు, వీడీవోస్ కాలనీ, బ్యాంక్ కాలనీ, పీజీ కళాశాల తదితర ప్రాంతాల్లో ఈ చిత్రాలు ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపచేస్తున్నాయి. – స్టాఫ్ ఫోటోగ్రాఫర్
సైనికుల
త్యాగాలను వివరిస్తూ..
ఖమ్మంసహకారనగర్: విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరడం ద్వారా ఇంకొందరి ఎదుగుదలకు తోడ్పాటునివ్వాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని శాంతినగర్ ఏఎస్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా అవసరమైన శిక్షణ, పుస్తకాల కొనుగోలుకు మలబార్ గోల్డ్ చారిటబుల్ సంస్థ బాధ్యులు రూ.3.80 లక్షల చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు చదువుకుంటూ మంచి స్థాయికి చేరాలని సూచించారు. ప్రధానంగా ఆడపిల్లలు చదువును ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. కాగా, తన భార్య కూడా మలబార్ సంస్థ వ్యవస్థాపకుల స్వస్థలమైన కాలికట్ వాసి అని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పవన్, భరత్‌కుమార్, రాణి, శ్రీనివాస్, కిరణ్, మలబార్ సంస్థ బాధ్యులు విష్ణు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఇంకొందరికి తోడ్పాటునివ్వాలి
ఇంకొందరికి తోడ్పాటునివ్వాలి
ఇంకొందరికి తోడ్పాటునివ్వాలి
ఇంకొందరికి తోడ్పాటునివ్వాలి
ఇంకొందరికి తోడ్పాటునివ్వాలి
ఇంకొందరికి తోడ్పాటునివ్వాలి
Comments
Please login to add a commentAdd a comment