ఖమ్మం, కల్లూరు, మణుగూరు జట్ల విజయం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న రాజీవ్‌గాంధీ స్మారక క్రికెట్ టోర్నీలో భాగంగా గురువారం నిర్వహించిన మ్యాచ్‌ల్లో ఖమ్మం అర్బన్, కల్లూరు, మణుగూరు జట్లు ముందంజలో నిలిచాయి. ఖమ్మం అర్బన్ – వైరా జట్ల నడుమ మ్యాచ్‌లో అర్బన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 112 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వైరా 107 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. కల్లూరు – ముదిగొండ మధ్య మ్యాచ్‌లో ముదిగొండ జట్టు 77 పరుగులు చేయగా, కల్లూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే, మూడో మ్యాచ్‌లో మణుగూరు–సత్తుపల్లి తలపడగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన మణుగూరు జట్టు 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఆతర్వాత సత్తుపల్లి 106 పరుగులకే ఆలౌట్ కావడంతో మణుగూరుకు విజయం దక్కింది. ఈమేరకు పోటీలను టోర్నీ ఆర్గనైజర్ ఎం.డీ.మతిన్ తదితరులు పర్యవేక్షించారు.
జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గాను జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. ఈనెల 20నుంచి వికారాబాద్‌లో జరగనున్న పోటీల్లో పాల్గొనే జట్ల వివరాలను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు దయాకర్‌రెడ్డి, కె.క్రిస్టోఫర్‌బాబు గురువారం వెల్లడించారు. ఈసమావేశంలో ఎస్.కే.ఇమామ్, ఉమ్మినేని కృష్ణ, ఊటుకూరి రంజిత్, ప్రసాద్, సుధాకర్, శివ పాల్గొనగాక్రీడాకారులకు కిట్లు అందజేశారు. కాగా, బాలురు జట్టుకు ఎం.సాంబశివరావు, బి.శరత్, సీహెచ్.ఆనంద్, జి.సోను, ఏ.నితిన్, యు.వెంకటకృష్ణ, బి.మనోజ్, జి.గణేష్, బి.రాఘవ, జి.హరి, ఎం.శివప్రసాద్, పి.వేణు, డి.అశోక్, బాలికల జట్టుకు బి.హనీ, ఎస్.కే.నాగహసీనా, టి.మేఘన శరణ్య, ఐ.కృష్ణవేణి, ఎస్.కే.రిజ్వానా, వై.నిఖిత, జి.శైలజ, బి.భావన, ఎస్.కే.పర్వీన్, బి.భాను, ఎస్.ప్రవీణ ఎంపికయ్యారని తెలిపారు.
నేడు ఉమ్మడి జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు
కొత్తగూడెంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు శుక్రవారం కొత్తగూడెం రామవరంలోని తెలంగాణ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కాశీహుస్సేన్ తెలిపారు. అండర్–10, 12, 14, 17 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో రావాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.
ఆలయాల నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం
కల్లూరురూరల్: కల్లూరు మండలం లక్ష్మీపురం(రాళ్ల బంజరు)లో సంత్ సేవాలాల్, మారెమ్మ ఆలయాల నిర్మాణానికి చిక్కుల అనసూర్య, ఆమె కుటుంబీకులు వెంకట రామారావు, రమేష్, మురళీకృష్ణ, గంధం స్వరాజ్యలక్ష్మి గురువారం రూ.2 లక్షల విరాళం అందజేశారు. అలాగే, గ్రామానికి చెందిన గుగులోతు లక్ష్మి ఆలయ నిర్మాణం కోసం ఒక కుంట స్థలం విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు పసుమర్తి చందర్‌రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
శాశ్వత నిత్యాన్నదానానికి విరాళాలు
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం వాసి తుపాకుల ఎలగొండ స్వామి – రమాదేవి దంపతులు రూ.లక్ష, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ వాస్తవ్యులు పీ.వీ.కృష్ణమూర్తి – జ్ణానద దంపతులు రూ.1,00,116ను ఆలయ అధికారులకు అందచేసి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, కత్తి శ్రీనివాసులుతో దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఖమ్మం, కల్లూరు, మణుగూరు జట్ల విజయం
Comments
Please login to add a commentAdd a comment