ఖమ్మంఅర్బన్: ఇంటి బయట ఆడుకుంటున్న పన్నెండేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2.10లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి కె.ఉమాదేవి గురువారం వెల్లడించిన ఈ తీర్పు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక 2021 ఫిబ్రవరి 7న ఇంటి బయట ఆడుకుంటుండగా వచ్చిన ఇద్దరు మాయమాటలతో బలవంతంగా మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి ఖమ్మం శివారు నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆతర్వాత ఇంటికి చేరున్న బాలిక ఇచ్చిన సమాచారంతో ఆమె తల్లిదండ్రులు ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఖమ్మం రమణగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ కాలేపల్లి సంపత్, ఖమ్మం మంచికంటినగర్‌కు చెందిన పెయింటర్ పసువుల నవీన్‌ను నిందితులుగా గుర్తించి పోక్సో కేసు నమోదు చేశాక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు కేసు విచారణలో నేరం రుజువు కాగా సంపత్, నవీన్‌కు జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఖానాపురం హవేలీ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. కేసు పకడ్బందీగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ.శంకర్, విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి, ప్రస్తుత సీఐలు వెంకన్నబాబు, భానుప్రకాశ్, కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, నాగేశ్వరరావును ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అభినందించారు.
రూ.2.10 లక్షల చొప్పున జరిమానా
Comments
Please login to add a commentAdd a comment