రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చింతకాని: మండలంలోని చిన్నమండవ మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు గురువారం సీజ్ చేశారు. పోలీసులు జగన్నాధపురం సమీపాన చేపట్టిన తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తన్నట్లు గుర్తించారు. దీంతో ట్రాక్టర్లను సీజ్ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
చోరీ ఘటనలో నిందితుల ఫొటోలు విడుదల
వైరా: వైరాలో ఈనెల 12న ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బంధించి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో సీసీ పుటేజీల ద్వారా నిందితుల చిత్రాలు, వారు ఉపయోగించిన కారు ఫొటోను పోలీసులు సేకరించారు. ఈమేరకు ఫొటోల ఆధారంగా నిందితులను ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఏసీపీ రెహమాన్ సూచించారు. నిందితులు నలుగురు తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారులో రాగా, ఒకరు పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నారని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 87126 59146, 87126 59147, 87126 59148 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
Comments
Please login to add a commentAdd a comment