తహసీల్ ఎదుట వృద్ధురాలి దీక్ష
మధిర: ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని పలుమార్లు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం ఆరోపిస్తూ ఓ వృద్ధురాలు తహసీల్ ఎదుట గురువారం నిరసన దీక్ష చేపట్టింది. మండలంలోని దెందుకూరుకు చెందిన కనకపూడి కరుణమ్మ ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఇటీవల తహసీల్దార్ రాంబాబుకు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దీక్షకు దిగినట్లు తెలిపింది. ఆక్రమణకు గురైన తన స్థలాన్ని ఇప్పించాలని లేకపోతే చనిపోవడానికి అనుమతి ఇప్పించాలని కోరింది. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా కరుణమ్మ ఫిర్యాదుతో సంబంధిత వ్యక్తులకు 15 రోజుల గడువుతో నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈనెల 22వ తేదీతో గడువు ముగియనుండగా ధ్రువపత్రాలు కలిగిన వారికి స్థలాన్ని అప్పగిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment