హాస్టల్ స్థలాన్ని ఆక్రమిస్తే చర్యలు
కారేపల్లి: కారేపల్లిలో బీసీ బాలుర వసతి గృహం నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించగా, నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే, ఈ స్థలంలో ఏర్పాటుచేసిన బోర్డును కొందరు తొలగించ డం, అక్కడ గద్దెల నిర్మించడంతో బీసీ సంక్షేమ శాఖ డివిజనల్ అధికారి ఈదయ్య గురువారం పరిశీలించా రు. స్థల ఆక్రమణకు యత్నిస్తే చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఈవిషయమై తహసీల్దార్ సంపత్‌కుమార్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. త్వరలోనే హాస్టల్‌కు కేటాయించిన స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట మధిర అధికారి డి.నర్సయ్య, హాస్టల్ వార్డెన్ వేణు, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment