22నుంచి ఆల్‌ఇండియా టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆల్ ఇండియా టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ నిర్వహించనున్నట్లు టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. చల్లపల్లి రాధమ్మ స్మారకార్థం నిర్వహించే టోర్నీ వివరాలను ఆయనతో పాటు అసోసియేషన్ బాధ్యులు ఎం.వెంకట్, డాక్టర్ కె.అనిల్, కె.సత్యనారాయణ, డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి గురువారం వెల్లడించారు. ఈనెల 22నుంచి మార్చి 1వరకు టోర్నీ నిర్వహించనుండగా 145 ఎంట్రీలు అందాయని తెలిపారు. ఆల్‌ఇండియా టెన్నిస్ అసోసియేషన్‌కు చెందిన చీఫ్ రిఫరీ ప్రవీణ్ నాయక్ డ్రాలు ఖరారు చేస్తారని చెప్పారు. అలాగే, స్టేడియంలోని మూడు కోర్టుల్లో మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment