సత్తుపల్లి: సత్తుపల్లి డివిజన్ ఆయిల్‌ఫెడ్ అధికారి బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్‌బాషా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని రేగళ్లపాడు నర్సరీలో ఆఫ్‌టైప్(నాటడానికి పనికి రానివి)గా తేలిన 80వేల ఆయిల్‌పామ్ మొక్కలను అనుమతి లేకుండా ధ్వంసం చేయించినట్లు ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకోసం వెచ్చించిన నిధులు డ్రా చేసినట్లు తెలుస్తుండగా, ఈనెల 9, 10వ తేదీల్లో ఉద్యానవన శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈమేరకు వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా బాలకృష్ణను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా, గతంలోనే నర్సరీ సూపర్‌వైజర్లు పృధ్వీలాల్, కృష్ణారావును విధుల నుంచి తొలగించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment