
సైలోబంకర్‌కు పిండప్రదానం
సత్తుపల్లి: సత్తుపల్లిలోని సింగరేణి సైలోబంకర్ నుంచి వెలువడుతున్న దుమ్ముధూళితో శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నామని, ఇప్పటికే పలువురు మృతి చెందినందున బంకర్‌ను తొలగించాలనే డిమాండ్‌తో కిష్టారం అంబేద్కర్‌నగర్ వాసులు చేపట్టిన నిరసనలు ఉధృతరూపం దాలుస్తున్నాయి. ఈమేరకు 12వ రోజైన శుక్రవారం మృతుల కుటుంబీకులు సైలోబంకర్ చిత్రపటానికి పిండప్రదానం నిర్వహించి వినూత్న నిరసన తెలిపారు. అంతేకాక సైలోబంకర్ నిర్మించినప్పటి నుంచి మృతి చెందిన వారి ఫొటోలను దీక్షా శిబిరం వద్ద ప్రదర్శించగా పలువురు కంటతడి పెట్టుకున్నారు. కాగా, దీక్షలకు బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రజల ప్రాణాలు కోల్పోతున్నందున తక్షణమే మంత్రులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సైలో బంకర్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించినట్లు తెలుస్తున్నందున విచారణ జరిపించాలని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. బీజేపీ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, ఈ.వీ.రమేష్, నన్నే ఉదయ్‌ప్రతాప్, భాస్కర్ణి వీరంరాజు, సుదర్శన్‌మిశ్రా, నాయుడు రాఘవరావు, మట్టా ప్రసాద్, పాలకొల్లు శ్రీనివాసరావు, నాగస్వామి, బానోతు విజయ్, నల్లమోతు నాని, మధుసూదన్‌రావు, రహ్మతుల్లా పాల్గొన్నారు.
ఉధృతరూపం దాల్చిన నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment