బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయం
ఖమ్మం మామిళ్లగూడెం: తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలపరుస్తున్న టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయనతో పాటు నాయకులు శుక్రవారం పలువురు ఉపాఽధ్యాయుల నివాసాలకు వెళ్లి ప్రచారం కోరారు. ఈసందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, డీఏల విడుదలను విస్మరించిందని ఆరోపించారు. ఈమేరకు ఉపాధ్యాయులు బీజేపీ బలపర్చిన సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కాగా, సరోత్తంరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉపాధ్యాయులను కలిశారు. నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్, రమణారెడ్డి, పరిశ రామ్మోహన్, కె.శ్రీనివాసరావు, కరిన హరిప్రసాద్, భూక్య సేవ్యా, నకిరికంటి వీరభద్రం, శీలం పాపారావు, నున్నా రవికుమార్, కోటేశ్వరరావు, అల్లిక అంజయ్య, మందా సరస్వతి, దొడ్డ అరుణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment