అన్ని వసతులు ఉన్నాయా?
పెనుబల్లి: పెనుబల్లి మండలంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా ఉప్పలచెలకలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలు, బోధన, కరాటే శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం మండలం కేంద్రంలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ యూరియా నిల్వల వివరాలు తెలుసుకున్నారు. అంతేకాక యడ్లబంజర్‌లో రైతులతో మాట్లాడి సాగు చేస్తున్న పంటలు, ఎరువుల లభ్యతపై ఆమె ఆరాతీశారు. అదనపు కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కేజీబీవీలో అదనపు కలెక్టర్ తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment