కూసుమంచి: మండంలోని నాయకన్‌గూడెంలో జలవనరుల శాఖ పరిధిలో ఉన్న అతిథిగృహం(ఐబీ గెస్ట్‌హౌజ్) త్వరలోనే పూర్వవైభవం సంతరించుకోనుంది. సాగర్ కాల్వల తవ్వకం జరిగే రోజుల్లో దీన్ని నిర్మించగా ఆతర్వాత వివిధ సందర్భాల్లో ముఖ్య మంత్రులు జలగం వెంగళరావు, ఎన్‌టీ రామారావుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు బస చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే, కొన్నేళ్లుగా నిర్వహణ సరిగ్గా లేక భవనం శిథిలం కాగా, వదిలివేశారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాలతో అధికారులు రూ.18లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో భవనం స్లాబ్‌ను సరిచేయడమే కాక రంగులు వేయించి కొత్త ఫర్నీచర్ సమకూరుస్తారు. తద్వారా ఏళ్ల క్రితం నాటి గెస్ట్‌హౌస్ మళ్లీ కళకళలాడనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment