పెనుబల్లి: బస్సు ఫుట్‌బోర్డుపై నిల్చున్న వ్యక్తి జారి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. కల్లూరు మండలం ముచ్చారానికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పసుపులేటి పుల్లారావు శుక్రవారం ఖమ్మం వైపు నుండి సత్తుపల్లి వైపు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆయన ఫుట్‌బోర్డుపై నిల్చోగా సత్తుపల్లి రోడ్డులోని సప్తపది ఫంక్షన్‌హాల్ సమీపానికి వచ్చేసరికి ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలైన పుల్లారావును పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
యువకుడిపై కత్తితో దాడి చేసిన హిజ్రా
ఖమ్మంరూరల్: మండలంలోని పెదతండాలో ఓ యువకుడిపై హిజ్రా కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పెదతండాలోని చికెన్ దుకాణంలో పనిచేస్తున్న యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ఓ హిజ్రాకు మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఆ హిజ్రా ఆవేశంతో యువకుడిని విచక్షణారహితంగా పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈమేరకు స్థానికులు ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment