కామేపల్లి: మండలంలోని కొండాయిగూడెం పెద్దచెరువు నుంచి గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అనుమతి లేకుండా నీటిని విడుదల చేశారు. ఈవిషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇరిగేషన్ డీఈఈ శంకర్ తెలిపారు. చెరువు నీటిని అక్రమంగా మోటార్ల ద్వారా తరలించినా, అనుమతి లేకుండా తూము నుంచి విడుదల చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, తూము వద్ద చేపల వలలు ఉండడం, ఆపై నీటిని విడుదల చేయడంతో ఇది మత్స్యకారుల పనేనని ఆయకట్టు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ముందే స్పందిస్తే...
కొండాయిగూడెం పెద్ద చెరువు నుంచి కొన్నాళ్లుగా అక్రమంగా నీటిని తరలిస్తున్నారని తెలిసినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో అక్రమంగా బావులు తవ్వించి మోటార్లు పెట్టి మరీ నీటిని ఎగువన ఉన్న పొలాలకు తరలించడం, చెరువు శిఖంలో పంటలు చేస్తుండడంతో తమకు నష్టం జరుగుతోందని పలువురు తెలిపారు. ఈవిషయమై పరిశీలంచాలని డీఈఈ, ఏఈఈలను ఉన్నతాధికారులు ఆదేశించడం స్పందించకపోవడం సరికాదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment