
వచ్చేనెల 7న వకుళామాత స్టేడియం ప్రారంభం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామానికి చెందిన తుళ్లూరు కోటేశ్వరరావు–నిర్మల సమకూర్చిన నిధులతో వకుళామాత స్టేడియాన్ని నిర్మించారు. శ్రీవారి కల్యాణం నిర్వహణకు నిర్మించిన ఈ స్టేడియాన్ని వచ్చే నెల 7వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రచారా నికి రూపొందించిన పోస్టర్లను శుక్రవారం జమలాపురం ఆలయంలో కోటేశ్వరరావు దంపతులు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి ఆవిష్కరించారు. అర్చకులు రాజీవ్‌శర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment