
అథ్లెట్‌ను అభినందించిన కలెక్టర్
ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల జరిగిన జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, 38వ జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్ ఎ.మైథిలిని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ శుక్రవారం అభినందించారు. ఆమె జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌లో ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు, 38వ జాతీయ క్రీడల్లో కాంస్య పతకం సాధించడం జిల్లాకే గర్వకారణమని తెలిపారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్‌లు ఎం.డీ.గౌస్, ఎం.డీ.అక్బర్ అలీ, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్‌లు పాల్గొన్నారు.
ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందించిన సీపీ
ఖమ్మంక్రైం: అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కొణిజర్ల పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఇ.లోకేశ్‌తోపాటు ఏఆర్ కానిస్టేబుల్ ఐ.బాలరాజు కుటుంబాలకు మంజూరైన భద్రతా ఎక్స్‌గ్రేషియా చెక్కులను పోలీసు కమిషనర్ సునీల్‌దత్ అందజేశారు. రూ.8లక్షల చొప్పున చెక్కులను శుక్రవారం అందించిన ఆయన శాఖాపరంగా ఎలాంటి సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటామని భరోసా కల్పించారు. అదనపు డీసీపీ నరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సెమీస్ దశకు చేరిన క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: రాజీవ్‌గాంధీ స్మారక క్రికెట్ టోర్నీ సెమీస్ దశకు చేరింది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న టోర్నీ లో భాగంగా శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. ఈమేరకు ఖమ్మం అర్బన్, నేలకొండపల్లి, కల్లూరు, మణుగూరు జట్లు ప్రత్యర్థి జట్లపై విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించాయి. తొలుత మ్యాచ్‌లను డాక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించగా టోర్నీ నిర్వాహకులు ఎండీ.మతిన్‌తో పాటు సిద్ధు, నాగేశ్వరరాజు, జావెద్, ఇబ్రహీం, వెంకటేష్, అంజలి పాల్గొన్నారు.
‘మెటా ప్లస్’ బాధితుల ఆందోళన
ఖమ్మంక్రైం: రెట్టింపు డబ్బు అందుతుందని చెప్పి మోసం చేసిన మేటా ప్లస్ సంస్థ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు శుక్రవారం ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈమేరకు పలువురు మాట్లాడుతూ నవీన్, నజీర్ మెటా ప్లస్‌ను దుబాయి కంపెనీగా చెబుతూ పెట్టుబడి పెడితే పది నెలలో రెట్టింపు వస్తుందని ఆశ చూపారని తెలిపారు. అంతేకాక దుబాయి, గోవా పర్యటనకు తీసుకెళ్తామనడంతో భారీగా పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు ముఖం చాటేరని ఆరోపించారు. ఇదేమిటని నవీన్, నజీర్‌ను అడిగితే రౌడీషీటర్లతో బెదిరిస్తున్నారని తెలిపారు. ఈమేరకు పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా, ఈ అంశంపై విచారణ చేస్తున్నామని వన్‌టౌన్ సీఐ ఉదయ్‌కుమార్ తెలిపారు.
క్షుద్రపూజలు చేశారని ఆందోళన
వైరా: వైరాలోని ఇందిరమ్మ కాలనీ సమీపాన ఓ రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. సదరు రైతు పొలంలో వరి నాట్లు వేయిస్తుండగా శుక్రవారం పాలప్యాకెట్లు, నెయ్యి, టార్చ్‌లైటు, పసుపు, కుంకుమ కనిపించాయి. దీంతో క్షుద్రపూజలు చేశారని పేర్కొంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు.
వివాహిత ఆత్మహత్య
వేంసూరు: మండలంలోని చౌడవరానికి చెందిన వివాహిత వి.జ్యోతి(19) శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈమేరకు ఏఎస్సై వెంకటేశ్వరరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే, ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

అథ్లెట్‌ను అభినందించిన కలెక్టర్

అథ్లెట్‌ను అభినందించిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment