సత్తుపల్లి టౌన్ : సత్తుపల్లి మండలం రామానగరంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. రెండు కోడి పుంజులు, ఏడు ద్విచక్ర వాహనాలు, రూ.1,640 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐఈడీ నిర్వీర్యం
దుమ్ముగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధి దుంపమార్క గ్రామం అటవీప్రాంతంలో మా వోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును భద్రతా బలగాలు ఆదివారం గుర్తించాయి. రైగుట్టహిల్ అడవుల్లో బలగాలు కూంబింగ్ చేపడుతున్న క్రమంలో ఐదు కేజీల ఐఈడీ బాంబును గుర్తించి నిర్వీర్యం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment