ఏసీబీకి చిక్కిన ఎకై ్సజ్ ఉద్యోగి
ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ సమయం సమీపించినా తీరు మార్చుకోలేని ఎకై ్సజ్ ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం బస్ డిపో రోడ్డులో సాయికృష్ణ బార్ నిర్వహించిన శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం మూసివేశాడు. మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్న ఆయన ఏడాది లైసెన్స్ ఫీజు చెల్లించగా ఎకై ్సజ్ శాఖ అధికారులు అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో బార్ లైసెన్స్‌కు జిరాక్స్ కాపీ కావాలని న్యాయవాది చెప్పడంతో శ్రీనివాస్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లానాయక్‌ను సంప్రదించాడు. ఇందుకోసం రూ.2వేలు డిమాండ్ చేయగా ఆర్థిక సమస్యలతో అంత ఇచ్చుకోలేనని చెప్పాడు. అయితే, లైసెన్స్ శ్రీనివాస్ తల్లి పేరిట ఉన్నందున ఆమెనే తీసుకురావాలని సూచించాడు. కానీ వృద్ధురాలైన ఆమె రాలేదని చెప్పినా ససేమిరా అనడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారి సూచన మేరకు రూ.1,500 ఇస్తానని శ్రీనివాస్ చెప్పగా సోమ్లానాయక్ అంగీకరించాడు. ఈమేరకు నగదుతో శ్రీనివాస్‌ను పంపించి మాటువేసిన ఏసీబీ అధికారులు డబ్బు తీసుకుంటుండగా సోమ్లాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోన్నారు. కాగా, ఏసీబీ దాడి జరిగిన సమయాన ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి సహా పలువురు అధికారులు ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను హైదరాబాద్‌లో రివార్డులు అందుకుంటుండడం గమనార్హం. 2012లో ఇదే ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి పట్టుబడిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు.
లైసెన్స్ కాపీ జిరాక్స్ ఇచ్చేందుకు
రూ.2వేలు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment