ఔను.. వీరు విజేతలు !
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసిన గ్రూప్ – 1, 2 ఫలితాల్లో జిల్లా వాసులు పలువురు సత్తా చాటారు. కష్టపడి చదివిన వీరు మెరుగైన మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి అభినందనలు అందుకుంటున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే ఇతర ఉద్యోగాలు చేస్తూనే గ్రూప్స్‌కు సిద్ధం కాగా, ఇంకొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ సిద్ధమయ్యారు.
● గ్రూప్–1, 2లో సత్తాచాటిన జిల్లా వాసులు ● ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న కొందరు..
●కల్లూరు మండలం నుంచి ఇద్దరు
కల్లూరురూరల్: గ్రూప్–1 ఫలితాల్లో కల్లూరు మండలం నుంచి ఇద్దరు యువకులు మంచి మార్కులు సాధించారు. మండలంలోని ఎర్రబోయినపల్లికి చెందిన దొడ్డాపునేని సందీప్ గ్రేప్–1 ఫలితాల్లో 506 మార్కులు సాధించాడు. ఆయన ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఎస్సైగా పనిచేస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సర్వేశ్వరరావు – పద్మ దంపతుల కుమారుడైన సందీప్ ఏన్కూరు రెసిడెన్షియల్ స్కూల్, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ తర్వాత బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్సై పోస్టుతో పాటు గతంలో గ్రూప్–4, రైల్వే శాఖలో ఉద్యోగం, పంచాయతీ కార్యదర్శి, అటవీ శాఖతో పాటు ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగం కలిపి ఆయన ఆరు ఉద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఇక చిన్నకోరుకొండికి చెందిన కుమ్మరి పంకజ్ గతంలోనే గురుకుల డిగ్రీ లెక్చరర్, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులతో పాటు గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం గ్రూప్–1 పరీక్షలో 404 మార్కులు సాధించాడు. ఆయన తల్లిదండ్రులు కుమ్మరి ప్రభాకర్‌రావు, కృష్ణప్రియ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు.
●గ్రూప్–2లో స్టేట్ ర్యాంక్..
కామేపల్లి: గ్రూప్–2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయగా కామేపల్లి మండలం గోవింద్రాలబంజరకు చెందిన గంగారపు సత్యనారాయణ–జ్యోతిర్మయి దంపతుల చిన్న కుమారుడు రత్నేశ్వరనాయుడు రాష్ట్రస్థాయిలో 197వ ర్యాంకు సాధించాడు. అలాగే, జోనల్‌లో 27వ ర్యాంకు వచ్చింది. ఆయనకు గ్రూప్–1లోనూ 467 మార్కులు సాధించడం విశేషం. ప్రసుత్తం రత్నేశ్వరనాయుడు ఖమ్మం కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా సివిల్స్ సాధనే తమ కుమారుడి లక్ష్యమని సత్యనారాయణ తెలిపారు.
●ఇది నాలుగో ఉద్యోగం..
తల్లాడ: తల్లాడ మండలం మల్లవరానికి చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు గ్రూప్–2లో 387 మార్కులతో రాష్ట్రంలో 148వ ర్యాంకు, జోన్‌లో 20వ ర్యాంక్ సాధించాడు. సన్నకారు వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన బీకామ్ పూర్తి చేశాక 2018లో తొలిసారిగా ఏపీలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాదించాడు. 2019లో తెలంగాణలో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ఉద్యోగం, 2020లో విద్యుత్ శాఖలో జేఏఓగా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం జేఏఓగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి మెరుగైన ర్యాంకు సాధించాడు. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందినా పట్టుదలతో చదివి తన ప్రతిభతో ఉద్యోగాలు సాధిస్తున్న ఆయన పలువురి అభినందనలు అందుకున్నాడు. కాగా, వెంకటేశ్వరరావు పదో తరగతి వరకు బాలభారతి విద్యాలయం, ఇంటర్ కేఎస్‌ఎం కళాశాల, డిగ్రీ ఖమ్మం డీఆర్‌ఎస్ కళాశాలలో చదివాడు.
ఔను.. వీరు విజేతలు !
ఔను.. వీరు విజేతలు !
ఔను.. వీరు విజేతలు !
Comments
Please login to add a commentAdd a comment